తెలుగు భాష సంస్కృత భాష నుండి పుట్టిందా ? తమిళ భాష నుండి పుట్టిందా ?
తెలుగు భాష సంస్కృత భాష నుండి పుట్టిందా ? తమిళ భాష నుండి పుట్టిందా ?
మొదట సంస్కృతం నుండి తెలుగు పుట్టినది అని ఏ పాఠ్య పుస్తకములలోను చెప్పరు! ఎక్కువ వరకు అలా చెప్పు వారు మన చుట్టూ ఉన్న సామాన్య మనుషులే! మనం ఎప్పుడైనా గుర్తు పెట్టు కోవలసిన మాట ఏమిటంటే మనం ఎప్పుడు కూడా మన చుట్టూఉన్నవాళ్లు చెప్పు ఏ విషయమును కూడా ఉట్టిగానే నమ్మ రాదు
*సంస్కృతం నుండి తెలుగు*
ఇది తప్పు ఎందుకనగా, ఒక భాష ఏ భాషా కుటుంబానికి చెందినదో అను చెప్పేది ఆ భాషా యొక్క వేర్లు (roots)
భాషకి వేర్లు ఏమిటంటే ఆ భాషా యొక్క ప్రాథమిక పదజాలం (Basic Vocabulary)
మరి మన భాషా యొక్క ప్రాథమిక పద జాలాన్ని గమనిద్దామా...
నేను, నువ్వు, మనం, మీరు, తమరు, వాళ్ళు, వారు, అతను, ఆమె, ఆవిడ, ఆయన, మేము, నా, నీ, తన మొ II
తల్లి, తండ్రి, అన్న, చెల్లె, అక్క, అత్త, అయ్యా, అమ్మమ్మ, తాతయ్య, బావ, మరిది, మరదలు, పిల్లలు, కొడుకు, కూతురు, పెద్దమ్మ, చినమ్మ, బాబాయ్, చెలి, మొగుడు, పెళ్ళాం, నెయ్యం మొ II
తల, కన్ను, నొసలు, వెంట్రుకలు, తోలు, చేతులు, కాలు, గుండె, కాలేయం, తొడ, అడుగు, వ్రేళ్ళు, గోర్లు, కనుబొమ్మ, నెత్తురు, నరం, కడుపు, ఊపిరి తిత్తులు మొ II
ఎరుపు, నలుపు, తెలుపు, పచ్చ, పసుపు పచ్చ, నారింజ, బూడిద మొ II
మాట్లాడు, పండు, విను, చేయు, తిరుగు, నడువు, అడుగు, పరిగెత్తు/ఉరుకు, కూర్చో, నలుపు, ఆడుచు, నుసుము, నవ్వు, తిను, చిందులు, చెప్పు, విచ్చు, చూడు, పిసుకు, వ్రాయి, చదువు, ఆళకించు ,కలుపు, చంపు, కను, తెంపు, కొయ్యు, తరుగు, నరుకు, ఆడు, కొట్టు, తిట్టు, వండు, మండు, మాన్పు, పట్టు, వదులు మొ II
ఇల్లు, రాయి, గళ్ళు, కొండ, ఊరు, నింగి, నెల, యేరు, వాగు, వంక, కడలి, బడి, గుడి, గిన్నెలు, పడక, కుండ (ఇది తెలుగే నాని నమ్ముతున్నాను), వెల, అమ్మకం, మన్ను, ఇసుక, నీళ్లు, నిప్పు/చిచ్చు, కాడు/కారు, వల, చెప్పులు, కట్టడం మొ II
*ఇవండీ మన భాషకి మూల పదాలు (సర్వ నామములు, మానవ సంబంధాలు, కౌరులు (రంగులు), క్రియ పదములు, అవయవాలు మొII), ఇవి లేకుండా మనం మన భాషనీ చచ్చిన మాట్లాడలేము. కానీ ఈ పదాల అన్నింటికీ సంస్కృతంకి ఎటువంటి సంభందం లేదు!*
Picture Source:
https://i.pinimg.com/originals/ab/0b/df/ab0bdf7ce76e86fbf62f1e7a103afec3.jpg
*తెలుగు - సంస్కృతం - ఇరాన్ - గ్రీకు*
నేను ---- అస్మి ------- అహ్మి -- యిమి
తండ్రి ---- పితృ ------ పాటర్ -- పటెరస్
తల్లి ----- మాతృ ----- మతెర -- మీతెర
అన్న ---- భ్రాతృ ----- బ్రతెర్ --- ఫ్రాతేర్
కూతురు - దుహితృ -- దుగ్ధర్ --- తుగాటర్
ఉల్లం ---- మానస్ --- మానహ్ - మెనోస్
నెల ----- మాస ----- మనోన్గా - మీనన్
చుక్క --- తార ------ స్టార్ ----- ఆస్టర్
మంచు --హిమ ----- జీహమ్ -- హెయిమా
పేరు --- నామ ----- నామన్ --- ఓనోమా
క్రొత్త --- నవ ------- నవ ------ నియస్
ఒకటి -- ఏక ------- ఉన ------ ఉనో
రెండు -- ద్వా ------ దుఆ ----- ది
మూడు - త్రి ------- త్రై -------- త్రి
నాలుగు - చతుర్ --- చతుర్ ---- తెత్ర
తీపి ---- మధు ---- మధు ---- మెతు మొII
*పైన చూసినట్లైతే సంస్కృతం మన తెలుగు కన్నా బయట భాషలైన అవేస్టాన్ (ఇరాన్), గ్రీకు వంటి భాషలకు దగ్గరగా ఉంది! ఇప్పుడు సంస్కృతం ఆంగ్లం ని చూడుము!*
*సంస్కృతం - ఆంగ్లం – తెలుగు*
ద్వారం ----- డోర్ --- తలుపు
న --------- నో ----- లేదు/కాదు
దంత ------ డెంటల్ - పన్ను/పల్లు
హస్త ------ హ్యాండ్ -- చేతు/కై
దైవం ----- డీయిటీ -- వేల్పు
నాసికం --- నోస్ ----- ముక్కు
తరు ------ ట్రీ ------ మ్రాను
ప్రథమ --- ప్రైమరీ --- తొలి మొII
కనుక ఇప్పుడు మీకు అర్థం అయ్యి ఉండొచ్చు, అది సంస్కృతం ఇండో - ఐరోపా భాషా అని కానీ మన తెలుగు వేరే భాషా కుటుంబానికి చెందినది.
అదే కుటుంబంలో తమిళం, కన్నడం, మలయాళం, తుళు, గోండి, కువి, కూరుఖ్, బ్రహుయి వంటి కొన్ని భాషలు కూడా ఉన్నాయి.
ఇవన్నింటికీ ద్రావిడ భాషలు అని పేరు!
మన తెలుగుకి తల్లి "ప్రోటో తెలుగు" ఇక మన తెలుగు యొక్క అమ్మమ్మ "ప్రోటో ద్రావిడ"
అయితే మీకు ఈ ప్రశ్నలో వచ్చిన సందేహం సమంజసమే, ఎందుకనగా, చాలా మంది తమిళులు ఆ ప్రోటో ద్రావిడ భాషా మరేదో కాదు తమిళమే అని అంటారు.
ఎందుకు అంటారు?
వాళ్ళ ప్రకారం, ఏ భాషకైతే చాల ప్రాచీన లిఖిత చరిత్ర ఉంటుందో అదే తల్లి భాష!
అది నిజామా ?
కల్లా!
ఎందుకు?
ఇప్పటి వరకు భాషా శాస్త్రవేత్తలు ౫౬౭౩ (5673) ద్రావిడ మూల పదాలను కనుగొన్నారు, అయితే అందిలో కేవలం ౩౫౪౧ (3541) ద్రావిడ మూల పదాలనే తమిళం కలిగి ఉంటుంది అంటే దాదాపు ౪౦% (40%) ద్రావిడ పదాలు తమిళంలో లేవన్నమాట!
ఇక తెలుగు భాషా విషయానికి వస్తే, తమిళం మరియు తెలుగు ౫౬౭౩ (5673)లో కేవలం 2083 ద్రావిడ మూల పదాలు పంచుకొని ఉన్నాయి, అనగా ౯౦౬ (906) ద్రావిడ పదాలు మన తెలుగులో తమిళంలో లేనివి ఉన్నాయి.
కావున, తమిళం "తెలుగుకి తల్లి" ఖచ్చితంగా కాదు, దాన్ని మించి, తమిళం "ప్రోటో ద్రావిడ" కూడా అవ్వదు.
సూటిగా సుత్తిలేకుండా చెప్పాలంటే,
*తెలుగుకి తల్లి "ప్రోటో తెలుగు"*
*తమిళం మన త్రోబుట్టువు!*
*సంస్కృతం మన మిత్రురాలు!*
.
తమిళం,తెలుగు ఒకే ద్రవిడ భాష నుండీ ఒకటి రెండు శతాబ్దాల తేడాతో రూపొందిన భాషలు. మలయాళం ఆ తరువాత చాలా శతాబ్దాలకు సంస్కృత, తమిళ కలయికతో యేర్పడ్డది. కొడగ, బహు, కూ భాషలకూ, ప్రాచీన తెలుగుకూ ఒకటే మూల భాష. తరువాతి కాలంలో ఈ భాషలు ఔత్తరాహి, ద్రవిడ పదాలను తమలో చేర్చుకొని పరి పుష్టం అయ్యాయి. ఉదా.. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం...ల్లో చివరి రెండూ సంస్కృత శబ్దాలు. వాస్తవానికి ఉత్తరం తెలుగులో వడ అంటాం. దాన్నుంచే ఉత్తరం నుంచి వచ్చే గాలులను వడ గాలులుగా పిలుస్తాం. వాడుకలో కొచ్చె సరికి ఉత్తరం అనే అంటాం. అలాగే తెన్...దక్షిణం. దక్షిణం వేపు పండే పంట కనుకనే తెన్ కాయ టెంకాయగా మారింది. దీని మీద తిరుమల రామచంద్ర గారి పరిశోధనా వ్యాసాలు పుస్తకంగా వొచ్చేయి. "లిపి..దాని పుట్టుపూర్వోత్తరాలు'' లాంటివి ఆసక్తి ఉన్నవాళ్ళకి ఉపయోగపడతాయి.
***************
Comments
0 comment