విఘ్నా లు తొలగించు విఘ్ననాయకా

విఘ్నా లు తొలగించు విఘ్ననాయకా

విఘ్నా లు తొలగించు విఘ్ననాయకా

విఘ్ననాయకా

**విఘ్నాలు తొలగించు విఘ్ననాయకా**

 

విఘ్నా లు తొలగించు విఘ్ననాయకా, 

అవిఘ్నమస్తుగా మము 

దీవింపు మయ్యా,

వరములు కూర్చే వరదాయకా,

స్థిరముగా మా మది కొలువుండ వయా...

 

గణములకధిపతి గణ నాయకా,

గుణ గణములు మాలో పెంపు చేయవయ్య,

సిరులను కలిగించు లక్ష్మి గణపతి,

సిరి తోడుగ మా ఇళ్లను 

పావనము చేయుమయా.

 

సకల విద్యలకెల్లా ఆద్యుడవు నీవే,

విద్య విజ్ఞానము మాలో పెంపు చేయు మయా,

శుభ కార్యములకు శుభారంభము కూర్చి 

శుభములు కలిగించు హేరంభ గణపతీ...

 

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి.