చరిత్రలో ఈరోజు:జూన్ 20
సంఘటనలు
325: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలిని నియమించింది.
936: ఫ్రాన్స్ (ప్రాన్స్ కి తెలుగు పదము: : పరాసు) రాజుగా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం.
1097: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడు) నిసీ (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
1429 : జోన్ ఆఫ్ ఆర్క్ (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో వేడుకలు జరుపుకుంటారు.
1498: మకియవెల్లిని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు
1586: ఉత్తర కరోలినా లోని ఆంగ్లేయ వలస దారులు తమ దేశానికి (ఇంగ్లాండ్ ) కి తిరిగి వెళ్ళారు.
1586 : ఆంగ్లేయ వలస దారులు, ఇంగ్లాండు యొక్క శాశ్వత వలసలను నెలకొల్పటంలో ఓడిపోయి, ఉత్తర కరోలినా లోని రోనోక్ దీవినుంచి ఓడలలో తిరిగి ఇంగ్లాండుకు బయలుదేరారు.
1778: అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు అయిన జార్జ్ వాషింగ్టన్ యొక్క దళాలు చివరకు ఫోర్జ్ వేలీ నుంచి బయలుదేరాయి.
1846: మొదటి బేస్బాల్ గేమ్ - NY నైన్స్ 23, NY నికెర్బోకెర్స్ 1
1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 1857 జూన్ 20 నాడు గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది.
1862: అమెరికా సంయుక్త రాష్ట్రాలులో బానిసత్వం రద్దు అయ్యింది.
1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
1875: ప్రెసిడియో అనే ప్రాంతంలో, అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంభించింది.
1877: కెనడా లోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్ చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం.
1910: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు
1931: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
1947: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు.
1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపింది.
1991: 10వ లోక్ సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో, అమలు లోనికి వచ్చింది.
1991: పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నం జరిగింది.
2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
🌻🌻జననాలు🌻🌻
1566: స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI జననం. తరువాత జేమ్స్ 1 పేరుతో ఇంగ్లాండ్ రాజు అయ్యాడు (మ.1625).
1623: ఫ్రెంచ్ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన బ్లేజ్ పాస్కల్ పుట్టాడు (మ.1662).
1856: ఎల్బెర్ట్ హుబ్బార్డ్, రచయిత (మ.1915).
1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
1876: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (మ. 1956)
1900: గయాప్రసాద్ కటియార్, "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు.(మ.1993)
1914: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (మ.1972)
1939: రమాకాంత్ దేశాయ్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (మ.1998)
1945: అంగ్ సాన్ సూకీ, నోబెల్ శాంతి గ్రహీత.
1946: కుందూరు జానారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంశాఖా మంత్రి.
1980: అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సాహిత్య పరిశోధకుడు, 2014 కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.
🌹🌹మరణాలు🌹🌹
1919: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (జ.1854)
1986: ముర్రే పి హేడన్, కృత్రిమ గుండె గ్రహీత, కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు
1972: కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1898)
1987: సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (జ.1896).
2013: ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్ సభ్యుడు, రచయిత, అనువాదకుడు. (జ.1928)
Comments
0 comment