ఏమున్నది? ఏ రాజకీయ పార్టీ వరస చూసినా .
ఏమున్నది?
--------------
ఏ పార్టీ వరస చూసినా
ఏమున్నది చెప్పుకుందుకు?
రాజకీయాల సారం మొత్తం
అక్రమార్జన, అవినీతి కులుకు
పది తోడేళ్లు ఎన్నికలలో నిలబడి
మా లోంచి ఒక గోవును ఎన్నుకో మనడం
సమాజ మంతటినీ ఆకట్టుకో లేక
ఒకభాగానికి ఉద్ధారకులుగా సిద్ధమవడం
పాతికమంది గుoడాలను చేర్చుకొని
సెటిల్ మెంట్లు, వసూళ్లు, నాయకుడైపోవడం
పోలీసులు చట్టాన్నిబట్టి పోకుండా
నేతల సొంతసైన్యాలుగా పనిచెయ్యడం
చట్టసభలలో చర్చలకు ఎన్నికైన ప్రతినిధులు
పాలనావిభాగాలపై పెత్తనం చెయ్యడం
మళ్లీ మళ్లీ గడ్డితినే ఓటర్లు
తమను దోచుకునే వారిని తామే ఎన్నుకోవడః
అన్నం అరిగించుకోలేని కడుపుల్లా
కోర్టులు కేసుల్ని నాన్చడం
అవినీతిలో ఈతలు కొడుతూ
ఆదర్శాలను వల్లించడం
ఇంత దోపిడి సాధ్యమైందంటే
ఈ గడ్డ ఎంత సంపన్నమైనదో.
Written by: వి.వి.సుబ్రహ్మణ్యం. 9490104820.
Comments
0 comment