నాలందా Na-Lan-Da University.
Nalanda University, Rajgir, Bihar 803116, India
-------
నాలందా
---------
తక్షశిలా విశ్వవిద్యాలయం 2,500యేళ్ల క్రితంది. ప్రపంచంలోనే మొట్ట మొదటి విశ్వవిద్యాలయం. సామాన్యశకానికి పూర్వం (BCE) 5వ శతాబ్దిలో గాంధార రాజ్యంలో ఇప్పటి కాందహార్, పాకిస్తాన్ సరిహద్దులో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. ఇది మనదేశ విశ్వవిద్యాలయం. ఈ తక్షశిలా విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయంలో స్పష్టత లేదు.
పుష్పగిరి విశ్వవిద్యాలయం, దీన్ని వ్యావహారికశకానికి పూర్వం 2వశతాబ్దిలో అశోకుడు నిర్మించాడు. అటు తరువాతిది నాలందా విశ్వవిద్యాలయం. ఇది సామాన్య శకం 5వ శతాబ్దిలో వైదిక లేదా హిందూరాజు కుమార గుప్తుడు-1 లేదా శక్రాదిత్యుడు నిర్మించాడు. వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది బోధకులు, వందలాది మంది ఉపబోధకులు ఉండేవారు ఈ విశ్వవిద్యాలయంలో. ఇక్కడ వైద్యం, విజ్ఞానం, జ్యోతిషం, సాహిత్యం, కళలు, మహాయానబౌద్ధం వంటివి నేర్పబడేవి. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. నాగార్జున, ధర్మపాల, దిజ్ఞాన, శీలభద్ర కమలకేయ వంటివారు ఇక్కడ ఉపకులపతులుగా ఉండేవారు. 7వ శతాబ్దిలో చైనీస్ యాత్రికుడు షాన్ జాంగ్ (XuanZang) ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. ఇతడి మరో పేరు హైయన్ సాంగ్ (Hiuen Tsang, హువాన్ త్సాంగ్ కాదు).
ముష్కరుడు, మతోన్మాది టర్కీ ముస్లిమ్ చొరబాటు దారుడు ముహమ్మద్ బఖ్తయర్ ఖల్జీ (ఖిల్జీ) ఈ విశ్వవిద్యాలయాన్ని, ఇతర బౌద్ధ విహారాలన్నీ 1193-1205 మధ్య కాలంలో ధ్వంసం చేశాడు అనీ, బౌద్ధసన్యాసుల, బ్రాహ్మణ అధ్యాపకుల నరమేధం చేశాడని అంతర్జాతీయ చరిత్రకారులు విశ్వవ్యాప్తంగా తెలియజెప్పారు.
ఈ ఖల్జీ విక్రమశీలా, ఒదంతపురి విశ్వవిద్యాలయాల్ని కూడా ధ్వంసం చేసేశాడు. మనదేశంలో బౌద్ధాన్ని పూర్తిగా నాశనం చేసింది కూడా ఇతడే. నాలందాకు పూర్వమే 1027లో జగద్దల విశ్వవిద్యాలయం కూడా ముస్లిమ్ చొరబాటుదారుల దాడికి ధ్వంసం అయింది. బఖ్తయర్ ఖల్జీ తగలబెట్టిన నాలందా గ్రంథాలయంలో సంస్కృత గ్రంథాలే అత్యధికంగా ఉండేవి. బౌద్ధంలోని మహాయానం, వజ్రయానం అభివృద్ధి చెందడాని నాలందా కారణమైంది.
టిబెట్ వనరులు 12, 13 శతాబ్దుల్లో టర్కీ ముస్లీమ్ ముష్కర చొరబాటుదారులవల్ల జరిగిన నాలందా విధ్వంసాన్ని ప్రపంచమంతా తెలియజెప్పాయి. George Reorich ఆంగ్లంలోకి అనువదించిన టిబెట్ యాత్రీకుడు ధర్మస్వామిన్ రచనలు నాలందాను ఖల్జీ ధ్వంసం చేసినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఖల్జీ బౌద్ధసన్యాసుల్ని మట్టు పెడుతున్న సందర్భంలో చెల్లాచెదురౌతున్న బౌద్ధ సన్యాసులను జయదేవ అన్న బ్రాహ్మణుడు తన శక్తి మేర ఆదుకున్నాడు అని ధర్మస్వామిన్ రచనలు లోకానికి తెలియజేస్తున్నాయి.
అమేరిక పరిశీలకుడు Hartmut Scharfe టిబెట్ ఆధారాలతో విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని ఖల్జీ ధ్వంసం చేశాడని చెప్పాడు. చరిత్రకారుడు Andre Wink ఒదంతపురి విశ్వవిద్యాలయాన్ని ఖల్జీ ధ్వంసం చేశాడని చెప్పాడు. 17వ శతాబ్ది బౌద్ధ పండితుడు తారానాథ్ ఒదంతపురి, విక్రమశీల, నాలందాలను ఖల్జీ ధ్వంసం చేసినట్టుగా తెలియజేశాడు.
మిన్హాజ్ - ఎ- సిరాజ్ కృతి తబ్ఖాత్-ఎ-నాసిరీ బఖ్తయర్ ఖల్జీ బౌద్ధ విహారాల్ని ధ్వంసం చేశాడని తెలియజేస్తోంది.
James Meston సంపాదకత్వంలో వచ్చిన Hutchison's Story of Nationsలో బఖ్తియర్ ఖల్జీ నాలందా, విక్రమశీల, ఒదంతపురి విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం చేసి, బ్రాహ్మణ, బౌద్ధ నరమేధం చేశాడని తెలియజెప్పబడింది.
విదేశీమత ముష్కరుల దాడికి బలైన నాలందా 8శతాబ్దుల తరువాత ఇప్పుడు పునర్నిర్మితమైంది. ఇది చారిత్రికం. ఈ సమయంలో కొందరు వికృత స్వభావులు కులోన్మాదులు, దేశ వ్యతిరేకులు, అసాంఘీక శక్తులు, నేరచరిత్ర ఉన్నవాళ్లు తమ పొట్ట కూటికోసం, ఆదాయం కోసం, విదేశీమత ధనం కోసం నాలందాను ధ్వంసం చేసింది ఖల్జీ కాదు బ్రాహ్మణులు అని వక్రంగా అరుస్తున్నారు. 'చదువు' లేకపోవడం, సిగ్గులేకపోవడం ప్రాతిపదికలుగా, సరిగ్గా బతకలేని నంపుసకత్వం అర్హతగా, సనాతనంపై దాడిగా కొందరు నాలందా విషయంలో చరిత్రకు, అంతర్జాతీయ అధ్యయనానికి వ్యతిరేకంగా పేలాపనలు చేస్తున్నారు. ఏ పేలాపనలూ అంతర్జాతీయ అధ్యయనాన్ని, చరిత్రను మార్చలేవు; ఏ విదేశీ ధనంతోనూ అసత్యాలు సత్యాలు అయిపోవు.
రోచిష్మాన్
+91 9444012279
దీని తరువాత భారతదేశంలో
బౌద్ధమతానికి చివరి దెబ్బ, చావు దెబ్బ ఢిల్లీసుల్తాను సికందర్ లోడీ కాలంలో తగిలింది. అతడు ఒకసారి తక్షశిల వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయంలో ముండితశిరస్కులైన కాషాయధారులను చూసి "నేను మళ్లీ వచ్చేసరికి ఇదంతా కాళీ అయిపోవాలి" అని ఆదేశం ఇచ్చాడు. మరుసటి సంవత్సరమో ఆపై సంవత్సరమో అతడు తిరిగి అక్కడకు వచ్చి చూడగా అక్కడ అంతా పూర్వంలాగే ఉంది. దానితో ఆగ్రహించి అతడు తక్షశిలా విశ్వవిద్యాలయం లోని మొత్తం ఆచార్యులను విద్యార్థులను సుమారు ఆరువేల మందిని తలలు నరికించాడు.
ఇలాంటి దారుణాలు హిందూ సమాజంపై లెక్కలేనన్ని హిందువులు కేవలం హిందువులై ఉన్న కారణం లక్షల సంఖ్యలో చంపబడ్డారు, చెరచబడ్డారు,బలవంతంగా మతం మార్చబడ్డారు. ఇలా మతం మారినవారే ఈనాడు భారత్ పాకిస్తాన్ ల లోని ముస్లింలలో అత్యధికులు. ఆ గతాన్ని మరచి వీరు తమపై బలవంతంగా రుద్దబడిన ఇస్లాంను తలచుకుని గర్వించడం, తమ రక్తబంధువులైన హిందువులను హిందూ ధర్మాన్ని ద్వేషించడం విచిత్రం, విషాదకరం.
జర్మనీ నాజీల కాలంలో యూదులపై తమవల్ల జరిగిన హోలోకాస్ట్ వంటి దారుణాలకు పశ్చాత్తాపం ప్రకటించింది. జపాన్ రెండవ ప్రపంచయుద్ధ కాలంలో తమ సైనికులు ఇండోచైనా దేశాల ప్రజలపై జరిపిన ఘాతుకాలకు పశ్చాత్తాపం ప్రకటించింది.
కాని భారతసమాజం పై తాను జరిపిన దారుణాలకు, రక్తపాతాలకు ఇస్లాం ఈనాటికి పశ్చాత్తాపం ప్రకటించలేదు, తమ కాఫిర్ జీహాద్ సిద్ధాంతాలను విడిచిపెట్టలేదు.
For latest infomation on Nalanda University, click below link:
Comments
1 comment