ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
**ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం**
అమర జీవి ఆకుంఠీ త దీక్షా ఫలం,
ఆంధ్రప్రదేశ్ అవతరణం,
ఆ అమర జీవి బలి దాన ఫలం,
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం..
ఆయన ఆత్మర్పణం వమ్ము కానీయద్దు,
అన్న గారి ఆత్మ గౌరవ నినాదం వృధా పోనీయద్దు,
కుల మతాలు పక్కన పెట్టి,
జాతి విభేదాలు ఆ వలకు నెట్టి,
వారి అడుగు జాడల్లో నడుద్దాం,
ప్రగతి పధం లో రాష్ట్రాన్ని నడుపుదాం,
రైతన్న ని రాజును చేద్దాం,
కూలన్న ను యాజమాన్యమ్ లో భాగస్వామిని చేద్దాం,
యువత ను నిర్వీర్యం గానీయక ప్రగతి పధం లో నిల బేడదాం..
రే పన్నది మాపు కానీయక,
లక్ష్యం చూపు ప్రగతి పధం పై
పెడ దాం,
పసి దనాన్ని మసి పార నీయక,
పలకా బలపం తో దాన్ని అక్షర బద్ధం చేద్దాం,
అందరికీ సమాన హక్కుల తో, బాధ్యతలతో ముందుకు నడుపుదాం, నడుద్దాం...
జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్.
చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
Comments
0 comment