నవతేజం నింపుతూ నిద్దురలేపి....

అలుముకున్న చిక్కని చీకటిని

తన కిరణాలతో తరిమేసి

అవని అణువణువూ  తాకి

నవతేజం నింపుతూ నిద్దురలేపి....

అలుముకున్న చిక్కని చీకటిని

తన కిరణాలతో తరిమేసి

అవని అణువణువూ  తాకి

నవతేజం నింపుతూ నిద్దురలేపి....

 

చిరునవ్వులు చెరిగిపోనీక

పెను ఆశలు కరిగిపోనీక

దూరాల తీరాలను దరి చేర్చే

గమనాన అడుగులకు తోడై...

 

కనుపాపకు రెప్పవోలే

తన కన్న బిడ్డ వోలే

ప్రతి అడుగుకు ఆసరాగా

ప్రతిరోజూ వీడక తోడొచ్చే...

 

జ్ఞానకాంతి దీపంలా

మహా కాంతిపుంజంలా

మనసులోకి మనుగడలోకి

కొత్తవెలుగులు ప్రసరిస్తూ....

 

పాతవైన గాయాలు మరిపించి

పాతుకున్న శంకలన్నీ తొలగించి

పాతరేసిన భయాలు పోగొట్టి

పాడుపడిన తోటకు వసంతం తెస్తూ

 

పచ్చపచ్చని భవితనిచ్చే

నచ్చినట్టి క్షణాలనిస్తూ

కచ్చితంగా జయం నీదంటూ

తెచ్చి ముంగిట ముగ్గులేసే

 

వెలుగుల వేకువకు

 

🌸🌸సుప్రభాతం🌸🌸

 

బృంద 🙏